వింబుల్డన్ పురుషుల సింగిల్స్ విజేత ఫెదరర్

గ్రాస్‌ కోర్టులో తనకు ఎదురు లేదని స్విస్‌ స్టార్‌ రోజర్‌ ఫెదరర్‌ మరోసారి నిరూపించాడు. రికార్డు స్థాయిలో 8వ సారి వింబుల్డన్‌  టైటిల్‌ను సాధించాడు. ఫైనల్లో బోస్నియా ఫ్లేయర్‌ మారిన్‌ సిలిక్‌ పై  6-3,6-1,6-4 స్కోరు తేడాతో ఫెడెక్స్‌ విజయం సాధించాడు. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌ లో సిలిక్‌ ఏ దశలోనూ ఫెదరర్‌కు పోటీ ఇవ్వలేకపోయాడు. ఫెదరర్‌ స్మాష్ లు, ఏస్‌లకు సిలిక్‌ దగ్గర సమాధానం లేకుండా పోయింది. ఇక ఈ టైటిల్‌ తో 7 సార్లు వింబుల్డన్‌ ట్రోఫిను సాధించిన పీట్‌ సంప్రాస్‌ రికార్డును ఫెదరర్‌ అధిగమించాడు. మొత్తంగా ఫెదదర్‌ కిది 19వ గ్రాండ్‌ శ్లామ్‌ టైటిల్‌ కావడం విశేషం.