వినియోగదారులకు మరో షాక్!

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) వినియోగదారులకు మరో షాకిచ్చింది. వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) అమల్లోకి రావడంతో అందుకు అనుగుణంగా ఇమ్మీడియేట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్) నగదు బదిలీలపై జీఎస్టీని కలిపి కొత్త చార్జీలను ప్రకటించింది. రూ.1000 లోపు ఎటువంటి చార్జీలు లేకున్నా ఆ తర్వాతి నుంచి లక్ష రూపాయల వరకు రూ.5+జీఎస్టీ, రూ. లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రూ.15+జీఎస్టీని ఖరారు చేసింది. ఈ మేరకు ఎస్‌బీఐ అధికారిక ట్విట్టర్‌లో పేర్కొంది. అంటే ఇక నుంచి స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసే నగదు బదిలీలన్నింటిపైనా తాజా చార్జీలు వర్తిస్తాయి.