విదేశీ ఇన్వెస్టర్ల గురించి ఆందోళన అక్కర్లేదు!

జీఎస్టీపై విదేశీ ఇన్వెస్టర్లు గురించి ఏమనుకుంటున్నారనే ఆందోళన అక్కర్లేదని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు ఎన్‌ఆర్ నారాయణమూర్తి అన్నారు. అయితే, కొత్త పరోక్ష పన్నుల వ్యవస్థ సమస్యలు లేని విధానం అని తెలుసుకున్నాక వారిలో భారత్ పట్ల గౌరవం మరింత పెరుగనుందన్నారు. జీఎస్టీ అమలుతో భారత్‌లోకి మరిన్ని విదేశీ పెట్టుబడులు రావచ్చని, మరింత ఉత్సాహంగా వారు మన మార్కెట్లో పాల్గొనవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.