వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం

వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. వచ్చే 24 గంటల్లో ఇది మరింత మరింత బలపడి ఈ నెల 18, 19న వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. 20న ఒడిశాలో తీరం దాటనుంది. అటు అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. వచ్చే రెండు రోజులు కూడా రాష్ట్రంలోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.