లోయలో పడ్డ కారు, నలుగురు మృతి

ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. పితోర్‌గఢ్‌లోని బేతులిధర్ వద్ద 400 ఫీట్ల లోతులో ఉన్న లోయలోకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.