లీవ్ రద్దు చేసుకున్న అకున్ సబర్వాల్ 

డ్రగ్స్ కేసు తీవ్రత దృష్ట్యా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తన సెలవులను రద్దు చేసుకున్నారు. డ్రగ్స్ కేసు విచారణ పూర్తయ్యే వరకు సెలవులను వాయిదా వేసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కేసు విచారణను త్వరగా పూర్తి చేయాల్సి ఉందన్న సబర్వాల్.. సెక్షన్ 67 కింద ఇప్పటికే పలువురికి నోటీసులు ఇచ్చామని తెలిపారు. వారందరినీ త్వరలో విచారిస్తామన్నారు.  విచారణ అనంతరం డ్రగ్స్‌తో ప్రమేయం ఉన్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. విచారణకు పోలీసుల సహకారం తీసుకుని.. వీలైనంత తర్వగా ఈ కేసును పూర్తి చేస్తామని అకున్ సబర్వాల్ తెలిపారు.