లాలు కూతురికి ఈడీ సమన్లు

ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ కుటుంబానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన కుమార్తె, రాజ్యసభ సభ్యురాలు మీసా భారతికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. రేపు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఢిల్లీలోని మీసా భారతి ఫాంహౌజ్ ను అటాచ్ చేసే యోచనలో ఈడీ ఉన్నట్లు తెలుస్తోంది. మనీ లాండరింగ్‌ కేసుకు సంబంధించి రెండో రోజుల క్రితం ఆమె నివాసంతో పాటు ఫాంహౌస్‌లో ఈడీ అధికారులు ఇప్పటికే సోదాలు చేశారు. పలు కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు.