లాలూ ఆస్తులపై సీబీఐ సోదాలు

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు షాక్ తగిలింది. పదకొండేళ్ల క్రితం ఆయన రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో మంజూరు చేసిన ఒక టెండర్ కు సంబంధించిన కేసులో ఆయనపై కేసు నమోదు చేసింది సీబీఐ.  లాలూతో పాటూ ఆయన భార్య, కుమారుడి పేర్లను కూడా ఎఫ్‌ఐఆర్ లో నమోదు చేశారు. దీనికి సంబంధించి పాట్నాలోని లాలూ నివాసంతో పాటూ రాంచీ, ఢిల్లీ, పూరీ, గుర్ గ్రాం లు సహా 12 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది.  2006లో ఆయన రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో హోటల్ కోసం రెండు ఎకరాల భూమిని అక్రమంగా కట్టబెట్టారని సీబీఐ ఆరోపిస్తోంది.  ఎఫ్‌ఐఆర్ లో లాలూ, రబ్రీదేవి, తేజస్వీయాదవ్, ఐఆర్‌సీటీసీ ఎంపీ పీకే గోయెల్, ఆర్జేడీ నేత పీసీ గుప్తా భార్య సరళా గుప్తా ల పేర్లను చేర్చారు.