లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఆల్ టైం రికార్డు స్థాయిలో ముగిశాయి. ఈ వారం ప్రారంభం నుంచి జోరు మీదున్న స్టాక్ మార్కెట్లు…. ఇవాళ కూడా అదే జోరును కొనసాగించాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 233 పాయింట్ల భారీ లాభంతో 32 వేల పాయింట్లను దాటింది. ఇటు నిఫ్టీ సైతం 76 పాయింట్ల లాభంతో 9వేల 891 దగ్గర క్లోజయింది. గత నెలలో ద్రవ్యోల్బణం 1. 54 శాతానికి పడిపోయిందన్న ప్రభుత్వ అంచనాలతో సెన్సెక్స్ పరుగులు పెట్టింది. అటు ఆర్బీఐ త‌న త‌ర్వాతి సమీక్షలో కీలక వడ్డీ రేట్లను తగ్గించనుందన్న వార్తలు కూడా మార్కెట్‌ కు కలిసి వచ్చాయి.