రోళ్లవాగు ప్రాజెక్ట్ ఆధునీకరణ పనులు ప్రారంభం

జగిత్యాల జిల్లా బీర్పూర్‌ లో రోళ్లవాగు ప్రాజెక్టు ఆధునీకరణ పనులను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. 60 కోట్ల రూపాయల ఖర్చుతో రోళ్లవాగు ప్రాజెక్టును పూర్తిగా ఆధునీకరిస్తున్నారు. ఒక టీఎంసీ నీటిని నిలువ చేసుకునేందుకు వీలుగా పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టారు. రోళ్లవాగు ప్రాజెక్టు ద్వారా బీర్పూర్, ధర్మపురి మండలాల్లోని 25 వేల ఎకరాల భూములకు సాగునీరు అందనుంది. స్థానిక ప్రజల తాగునీటి అవసరాలను కూడా ఈ ప్రాజెక్టు ద్వారా తీర్చనున్నారు. రోళ్లవాగు ప్రాజెక్టు పూర్తయితే రెండు పంటలు సాగు చేసుకోవచ్చని స్థానిక రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఈటెల రాజేందర్, ప్రభుత్వ చీఫ్‌ విప్ కొప్పుల ఈశ్వర్, ఎంపీలు కవిత, బాల్క సుమన్, జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.