రోడ్లపై నీటిని క్లియర్ చేస్తున్న జీహెచ్‌ఎంసీ సిబ్బంది

హైదరాబాద్ వ్యాప్తంగా కుండపోత వర్షం కురిసినప్పటికీ జీహెచ్ఎంసీ యంత్రాంగం వెంటనే సహాయక చర్యలను చేపట్టింది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసీ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు విధుల్లో నిమగ్నమయ్యారు. రాత్రి నుంచే సహాయక చర్యల్లో బిజీగా ఉన్నారు. రోడ్లపై ఎక్కడా వర్షపునీరు నిలిచిపోకుండా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా లక్డీకాపూల్, పంజాగుట్ట, అమీర్ పేట, హిమాయత్ నగర్, నారాయణగూడతో పాటు అసెంబ్లీ ముందు ఎప్పటికప్పుడు వర్షపు నీటిని తొలగిస్తున్నారు. ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో జనం ఎలాంటి ఇబ్బందుల్లేకుండా రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.