రైతులకు స్ప్రింక్లర్లు, డ్రిప్‌ పరికరాల పంపిణీ

వచ్చే ఏడాది నుంచి వ్యవసాయ శాఖకు ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెడతామన్నారు మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి. నాగర్ కర్నూల్‌ జిల్లాలో పర్యటించిన ఆయన.. మైక్రో ఇరిగేషన్‌ పథకంలో భాగంగా రేవల్లి గ్రామంలో మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి రైతులకు స్ప్రింక్లర్లు, డ్రిప్‌ పరికరాలను పంపిణీ చేశారు. వచ్చే ఏడాది నుంచి అన్నదాతకు ప్రతీ ఎకరాకు 8 వేల రూపాయల పెట్టుబడి సహాయం  ఇవ్వనున్నట్లు తెలిపారు. రైతులందరు సమగ్ర సర్వేలో తమ వ్యవసాయ భూమి వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. అంతేకాదు వచ్చే ఏడాది నుంచి వ్యవసాయానికి 24 గంటల పాటు కరెంటును ఇస్తామన్నారు మంత్రి పోచారం.