రెహ‌మాన్‌పై దియా ప్ర‌శంస‌లు

డ‌బుల్ ఆస్కార్ అవార్డ్ విన్న‌ర్ ఏఆర్ రెహ‌మాన్ పై బాలీవుడ్ బ్యూటీ దియా మీర్జా ప్ర‌శంస‌ల వ‌ర్షం కునిపించింది. న్యూయార్క్ లో జ‌రిగిన 18వ ఎడిష‌న్ ఐఫా వేడుక‌ల‌లో పాల్గొన్న దియా.. రెహ‌మాన్ ని ఆకాశానికి ఎత్తింది. కెరీర్ లో 25 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకున్న ఏఆర్ రెహ‌మాన్ ఇండియాకే కాదు ప్రపంచానికి ద‌క్కిన ఓ వరం అంది. రెహ‌మాన్ మ్యూజిక్ ఎంత విన‌సొంపుగా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అత‌ను సాధించిన విజ‌యాల‌కు మ‌నం అంద‌రం ఎంత‌గానో గ‌ర్వ‌ప‌డాలి. రానున్న రోజుల‌లో ఇలాంటివి ఎన్నో రెహ‌మాన్ సాధించాల‌ని, అంద‌రి ప్రేమ‌, ఆద‌రాభిమానాలు ఈ సంగీత ద‌ర్శ‌కుడికి ఎప్పుడు ఉంటాయ‌ని తెలిపింది.