రెండు కోట్ల తాటి, ఈత మొక్కలు టార్గెట్

నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి సమీపంలో జరిగిన హరితహరం కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి ఈత మొక్కలు నాటారు.

ఈ సంవత్సరం రెండు కోట్ల తాటి, ఈత మొక్కలు నాటి, వాటిని పెంచి పోషించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని పద్మారావు చెప్పారు. వచ్చే సంవత్సరం ఐదు కోట్ల తాటి, ఈత మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు. గీత కార్మిక కుటుంబాలు పది చొప్పున ఈత, తాటి మొక్కలు నాటి సంరక్షిస్తే భావితరాలకు అవి ఫలాలు ఇస్తాయని మంత్రి అన్నారు.

ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, టిఆర్ఎస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.