రెండు ఇళ్లను మింగేసిన భారీ గుంత

అమెరికాలో భారీ గుంత రెండు ఇళ్లను మింగేసింది. ఫ్లోరిడాలోని ల్యాండ్  ఓ లేక్స్‌  దగ్గర అకస్మాత్తుగా చిన్న గొయ్యి ఏర్పడింది. అది కొన్ని గంటల్లోనే.. ఇతర ప్రాంతాలకు విస్తరడంతో రెండు ఇళ్లు గుంతలో కూరుకపోయాయి. ప్రమాదాన్ని ముందే గుర్తించిన అధికారులు.. స్థానికులను ఖాళీ చేయించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబందించిన వీడియో సోషల్‌  మీడియాలో వైరల్‌   గా మారింది.