రుణాల కోసం పాస్ బుక్స్ తీసుకోవద్దు

పంట రుణాలు ఇచ్చేందుకు పూచీగా రైతుల పాస్ పుస్తకాలు, పహాణీలు తమవద్ద పెట్టుకోవద్దని బ్యాంకర్లకు ప్రభుత్వ ప్రత్యేక రెవెన్యూ కార్యదర్శి  బీఆర్ మీనా ఆదేశించారు. వివరాలు అన్నీ కూడ ఆన్ లైన్ అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. రికార్డ్స్ ఆఫ్ రైట్స్-1971 కు ప్రభుత్వం సవరణ చేసిందన్నారు.దీని ప్రకారం పంటు రుణాల కోసం రైతులెవరు బ్యాంకుల వద్ద తమ పాస్ పుస్తకాలు, పహాణీలు పెట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేసారు.