రికార్డు స్ధాయి లాభాల్లో స్టాక్ మార్కెట్

సోమవారం రికార్డు స్థాయి లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు….ఇవాళ కూడా అదే జోరును కొనసాగిస్తున్నాయి.  బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్  ఆల్ టైం గరిష్ట స్థాయిని తాకింది. ఒకానొక దశలో 31వేల 818 పాయింట్లను తాకిన సెన్సెక్స్…..ఆ తర్వాత కొంత తగ్గింది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా లాభాల్లో ట్రేడవుతోంది. 30 పాయింట్లకు పైగా లాభంతో 9వేల 800 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. మరో రెండు రోజుల్లో పలు కంపెనీలు త్రైమాసిక ఫలితాలు ప్రకటించనుండటంతో….మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడవుతన్నట్లు నిపుణులు చెబుతున్నారు.