రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి

రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి, రాష్ట్రపతి ఎన్నికల అదనపు రిటర్నింగ్ అధికారి రాజాసదారాం తెలిపారు. అసెంబ్లీలో ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర సీఈవో భన్వర్ లాల్, ఎన్నికల పరిశీలకుడు సునీల్ కుమార్ పరిశీలించారని చెప్పారు. ఈ నెల 17న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఆయన వివరించారు. రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన నిబంధనలను ఇప్పటికే ఎమ్మెల్యేలందరికీ పంపామని రాజా సదారాం తెలిపారు.