రామనాథ్ గెలుపు ఖాయం

రాష్ట్రపతిగా రామనాథ్ కోవింద్ గెలుపు ఖాయమని టీఆర్ఎస్ లోక్ సభాపక్ష నాయకుడు జితేందర్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ సూచన మేరకు ప్రధాని మోడీ కోవింద్ ను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశారని ఆయన చెప్పారు. టీఆర్ఎస్ ఎంపీలంతా కోవింద్ కు ఓటేశామని తెలిపారు. పార్లమెంటులో జరుగుతున్న రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ లో ఓటు వేసిన తర్వాత జితేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.