రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తా

రాజ్యసభలో తన ప్రసంగాన్ని అడ్డుకున్నందుకు…ఎంపీ పదవికి రాజీనామా చేస్తానన్నారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. గోరక్షక దళాల పేరుతో జరుగుతున్న దాడులను రాజ్యసభలో ప్రస్తావించిన ఆమె….ఎన్డీయే సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాతనే దాడులు పెరిగాయన్నారు. అయితే మాయావతికి ఇచ్చిన సమయం ముగియడంతో…డిప్యూటీ ఛైర్మన్ కురియన్ ఆమెను అడ్డుకున్నారు. దాంతో మాయావతి ఆగ్రహానికి గురయ్యారు. దళితులు, మైనార్టీలపై జరుగుతున్న దాడులను ప్రస్తావించినందుకు తనను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తన ప్రసంగాన్ని అడ్డుకుంటే రాజీనామా చేస్తానన్నారు. ప్రభుత్వం తీరును నిరసిస్తూ రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు మాయావతి.