రాజీనామా చేసే ప్రసక్తే లేదు!

తన పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ తేల్చి చెప్పారు. సీబీఐ సోదాలు, ఎఫ్ఐఆర్ లో తన పేరు చేర్చడంపై తేజస్వీ యాదవ్ స్పందించారు. ఇదంతా రాజకీయ కక్ష్యతో ప్రధాని మోడీ, అమిత్  షా చేస్తున్న కుట్ర అని ఆరోపించారు. హోటల్ టెండర్ల కేటాయింపులు జరిగిన సమయంలో తాను మైనర్ నని, కనీసం మీసం కూడా రాని సమయంలోనే తనను స్కాంల్లో ఇరికించాలని చూస్తున్నారన్నారని చెప్పారు. బీహార్ కేబినెట్ మీటింగ్ కు హాజరైన తేజస్వీ.. మహా కూటమిని చీల్చాలని బీజేపీ ప్రయత్నస్తోందని ఆరోపించారు. అటు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు సచ్ఛీలురుగా నిరూపించుకోవాలి లేదా కేబినెట్‌ నుంచి వైదొలగాలని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇప్పటికే తేల్చి చెప్పారు.