రమ్యకృష్ణ బాగా ఇబ్బంది పెట్టిందట!

రానా వ్యాఖ్యాతగా ఉన్న ఓ టీవీ కార్యక్రమంలో రాజమౌళి,శోభు యార్లగడ్డ పాల్గొన్న సందర్భంలో కొన్ని సరదా ప్రశ్నలు అడిగాడు. బాహుబలి మూవీ షూటింగ్ సమయంలో మిమ్మల్ని ఎక్కువగా ఎవరు ఇబ్బంది పెట్టారని రానా రాజమౌళిని అడిగాడు. జక్కన్న సమాధానం ఇస్తూ రమ్యకృష్ణ అని చెప్పేశాడు. ఒకానొక సందర్భంలో ప్రభాస్‌, అనుష్క పేర్లను కూడా రానా ప్రస్తావించాడు. దీనిపై స్పందించిన రాజమౌళి రానా పేరు లేదా అని అడిగి నవ్వులు పూయించారు. అభిమాన దర్శకుడు ఎవరని రానా అడిగితే సుకుమార్ అని రాజమౌళి సమాధానమిచ్చారు. మీ చిత్రాల్లో నచ్చిన మూడు చిత్రాలు ఏవి రానా అడిగితే బాహుబలి, ఈగ, మర్యాద రామన్న అని రాజమౌళి చెప్పారు.