రకుల్ కు బాలీవుడ్ లో బంపర్ ఆఫర్..!

స్టార్ హీరోల‌తో వ‌రుస ఛాన్స్‌లు కొట్టేస్తూ టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది ర‌కుల్ ప్రీత్‌సింగ్. సినిమాల్లో గ్లామ‌ర్‌తో పాటు న‌ట‌నకు ప్రాముఖ్య‌త‌నిస్తూ టాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్టుల‌ను కొట్టేస్తుంది ఈ బ్యూటీ. ఇప్పుడు ఈ బ్యూటీకి బాలీవుడ్‌లో భారీ ఆఫ‌ర్ వ‌చ్చింద‌ట‌. దీంతో అక్క‌డ స్థిర‌ప‌డాలంటే కొన్ని హ‌ద్దుల‌ను దాటాల్సి ఉంటుంది. కాబ‌ట్టి ర‌కుల్ కూడా ఆమె ప‌రిమితుల‌ను మార్చనున్నట్టు చెబుతున్నారు. ఆ సినిమాలో బికినీ సీన్‌తో పాటు లిప్‌లాక్ సీన్ కూడా ఉంద‌ట‌. మ‌రి ఆ ప్రాజెక్టు ఇంకా ప్ర‌క‌ట‌న కూడా కాలేదు. ప్ర‌స్తుతం మ‌హేష్ స‌ర‌స‌న స్పైడ‌ర్ సినిమా చేస్తోంది.