మొఘల్‌పురాలో మొక్కలు నాటిన మహమూద్ అలీ  

హైదరాబాద్  నగరంలో హరితహారం ఉద్యమంలా కొనసాగుతున్నది. మూడో విడత హరితహారం కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాలనీవాసులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మొఘల్ పురా తలబ్ కట్టలో గర్ల్స్ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో డిప్యూటీ సీఎం మహముద్ అలీ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ తో పాటు పలువురు నేతలు, స్థానికులు, విద్యార్థులు పాల్గొన్నారు.