మొక్కలను కాపాడే బాధ్యత సర్పంచులు తీసుకోవాలి

నాగర్‌ కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ లో హరితహారం, స్వచ్ఛ భారత్‌, గ్రామీణాభివృద్ధి  కార్యక్రమాలపై మంత్రి జూపల్లి కృష్ణారావు నియోజకవర్గస్థాయి సమావేశం నిర్వహించారు. మూడో విడత హరితహారంలో ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని పెంచే బాధ్యత కూడా తీసుకోవాలని సూచించారు. ప్రతి సర్పంచ్ హరితహారాన్ని బాధ్యతగా తీసుకోవాలని, మొక్కలు కాపాడాలన్నారు. డంప్ యార్డులకు చెత్త తరలించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. ఉపాధి హామీ కూలీలకు సకాలంలో కూలి డబ్బులు చెల్లించాలని ఆదేశించారు.