కేసీఆర్ కిట్ పథకంపై అవగాహన ర్యాలీ

కేసీఆర్ కిట్ పథకంపై జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మెట్ పల్లిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుంచి అంగన్ వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు భారీ ర్యాలీ తీశారు. ర్యాలీని ఎమ్మెల్యే విద్యాసాగర్  రావు ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం చేయించుకోవడం వల్ల కలిగే లాభాలను గర్భిణులకు వివరిస్తున్నారు. తల్లిబిడ్డల ఆరోగ్యానికి కేసీఆర్ కిట్  ఒక వరమని ఎమ్మెల్యే విద్యాసాగర్  రావు చెప్పారు. గతప్రభుత్వాలు చేయని అనేక సంక్షేమ కార్యక్రమాలు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు.