మెగాస్టార్ చిత్రంలో నయన్ కు 4 కోట్లు..?

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నుంది. భారీ బడ్జెట్‌తో నిర్మించ‌నున్న ఈ సినిమాను ప‌లు భాష‌ల్లో విడుద‌ల చేయ‌నున్నారు. అలాగే ఇద్ద‌రు క‌థానాయిక‌లుగా ఐశ్వ‌ర్య‌రాయ్‌, న‌య‌న‌తార‌ల‌ను తీసుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సినిమాకు న‌య‌న‌తార ఏకంగా 4కోట్లు డిమాండ్ చేసింద‌ని టాక్‌. దీంతో ఆమె అడిగినంత ఇవ్వ‌డానికి సిద్ద‌మైపోయార‌ట‌. ఆగ‌స్టు 15న ఈ సినిమాను లాంఛ్ చేయ‌నున్నారు.