మూఢనమ్మకాలపై ప్రజల్లో చైతన్యం కల్పించాలి

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కందుగులలో మంత్రాల నిందారోపణలతో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని ఎంపీ వినోద్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి చెందిన బంధువులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. దంపతులతో పాటు పదేళ్ల లోపు చిన్నారులు కూడా మరణించడం తనను బాధించిందన్నారు.

సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు సాగుతున్న ఈ రోజుల్లో ఇంకా మూఢనమ్మకాలను నమ్మడం సరికాదన్నారు వినోద్. మూఢనమ్మకాలపై ప్రజల్లో చైతన్యం కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అభిప్రాయపడ్డారు. ఆట, పాట, మాటతో మూఢనమ్మకాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ని కోరారు. కళాకారుల బృందంతో గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.