మురళి కుటుంబానికి కడియం పరామర్శ

దారుణ హత్యకు గురైన వరంగల్ కార్పొరేటర్ అనిశెట్టి మురళి కుటుంబాన్ని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పరామర్శించారు. ఎంజీఎం ఆస్పత్రి వద్దకు వెళ్లిన కడియం శ్రీహరి మురళి కుటుంబసభ్యులను ఓదార్చారు. మురళి మృతి పార్టీకి తీరని లోటన్నారు. మురళి మృతిపై సీఎం కేసీఆర్ సానుభూతి తెలిపినట్లు చెప్పారు. మురళిని హత్య చేసిన నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్పోరేటర్ మురళి కుటుంబానికి టీఆర్ ఎస్ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కడియంతోపాటు ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, పలువురు టీఆర్ ఎస్ నేతలు మురళి కుటుంబాన్ని పరామర్శించారు. నిన్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేటర్ అనిశెట్టి మురళిని కత్తులతో పొడిచి చంపిన అనంతరం, ముగ్గురు వ్యక్తులు హన్మకొండ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు.