ముగిసిన టీఆర్ఎస్ఎల్సీ సమావేశం

రేపు జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్ విధానంపై అవగాహన కల్పించేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మాక్ పోలింగ్ నిర్వహించారు.  సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ శాసనసభా పక్షం సమావేశమై… రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ విధానం పై చర్చించారు.ఎన్టీయే అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ కు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఇప్పటికే మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలు వేసే ఒక్క ఓటు కూడా వృథా కాకుండా చూసేందుకు.. ఎన్నికల పై అవగాహన కల్పించేందుకు మాక్ పోలింగ్ నిర్వహించారు. అటు రేపు ఉదయం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. తెలంగాణ భవన్ నుంచి అసెంబ్లీకి వెళ్లి….రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటారు.