మాల్యాను కోర్టులో హాజరుపరచండి

విజయ్‌ మాల్యా కోర్టు ముందుకు వస్తేనే తదుపరి విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. మాల్యా లేకుండా విచారణ జరపడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. మాల్యా కోర్టు ధిక్కార నేరంపై ఇవాళ విచారించిన న్యాయస్థానం.. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మాల్యాను అప్పగించే విషయంలో లండన్  కోర్టులో విచారణ జరుగుతోందన్న అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌.. నివేదికను న్యాయస్థానం ముందుంచారు. ఐతే, మాల్యా లేకుండా దాన్ని విశ్లేషించలేమని, ముందు అతన్ని కోర్టు ఎదుట హాజరు పరచాలని అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.