మార్కెట్లోకి మోటో ఈ-4 ప్లస్

లెనోవోకు చెందిన ప్రముఖ మొబైళ్ల తయారీ సంస్థ మోటరోలా.. మోటో ఈ సిరీస్‌లో భాగంగా మరో రెండు స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. రూ.9,999 ధర కలిగిన మోటో ఈ 4 ప్లస్ ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే లభించనున్నది. అలాగే రూ.8999 విలువైన ఈ 4 మొబైల్ రిటైల్ అవుట్‌లెట్లలో లభించనున్నది. 5.5 అంగుళాల టచ్‌స్క్రీన్ కలిగిన ఈ 4 ప్లస్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ముందు-వెనుక భాగాల్లో ఫింగర్‌ప్రింట్‌స్కానర్, ఆండ్రాయిడ్ 7.1 న్యూగట్ ఆపరేటింగ్ సిస్టమ్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ మీడియా టెక్ ప్రాసెసర్, 32 జీబీ ఇంటర్నల్ మెమొరీ(128 జీబీ వరకు పెంచుకోవచ్చును), 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, ముందుభాగంలో 5 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్స్ ఉన్నాయి. 5 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో రూపొందించిన ఈ 4లో ఇంచుమించే ఇవే ఫీచర్స్ ఉన్నాయి.