మార్కెట్లోకి ఛోట ఫోన్

రష్యాకు చెందిన ఎలరీ కంపెనీ బుల్లిఫోన్‌ను, మేటి ఫీచర్లతో మార్కెట్లో సరికొత్త ట్రెండ్‌ సృష్టించేందుకు సిద్ధం అయ్యింది. ఎలరీ జీఎస్‌ఎం విభాగంలో నానోఫోన్‌ సీ పేరిట సంస్థ భారత మార్కెట్లోకి దీనిని విడుదల చేసింది. ఈ విషయాన్ని ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌ యెర్హా.కామ్‌ ప్రకటించింది. దీని ధర రూ. 3,490. ఈ ఫోన్‌ క్రెడిట్‌ కార్డు కన్నా చిన్నది కావడం విశేషం. ప్రపంచంలోనే అతి చిన్న ఫోన్‌గా జీఎస్‌ఎం నానోఫోన్‌ సీ రికార్డుకెక్కింది. ఈ ఫోన్‌ గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు చూస్తే.. ప్రధానంగా ఈ ఫోన్‌ బరువు 30 గ్రాములు కాగా 1.4 అంగుళాల వెడల్పు, 3.71 అంగుళాల పొడవు, 0.2 అంగుళాల మందంతో ఉండనుంది. ఇది స్మార్ట్‌ఫోన్‌ కానప్పటికీ దీని అంతర్గత నిల్వ సామర్థ్యాన్ని 32 జీబీ వరకు మైక్రో ఎస్‌డీ కార్డుతో విస్తరించుకొనే సౌలభ్యం దీని మరో ప్రత్యేకత. ఎంపీ3 ప్లేయర్‌, ఎఫ్‌ఎం రెేడియో, వాయిస్‌ రికార్డర్‌, బ్లూ-టూత్‌ లాంటి మేటి ఫీచర్లతో ఈ ఫోన్‌ను సంస్థ అందించనుంది.