మలయాళ నటుడు దిలీప్ అరెస్ట్

సినీ నటి భావనను లైంగికంగా వేధించిన కేసులో మలయాళ నటుడు దిలీప్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. భావన కిడ్నాప్, లైంగిక వేధింపుల వెనుక దిలీప్ హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పల్సర్ సునీ ని విచారించిన పోలీసులు… కొద్ది రోజుల క్రితమే నటుడు దిలీప్ ను 13 గంటల పాటు ఇంటరాగేట్ చేశారు. ఈ కేసులో దిలీప్ భార్య కావ్య మాధవన్ హస్తం కూడా ఉండి ఉంటుందని భావిస్తున్నారు. అయితే, ప్రధాన నిందితుడు ఇచ్చిన సమాచారంతో ఆధారాలు సేకరించిన అనంతరం దిలీప్ ను అరెస్ట్ చేశారు. కొద్ది రోజుల క్రితం నటి భావనను పల్సర్ సునీ అనే వ్యక్తి కిడ్నాప్ చేసి కారులో నగరంలో తిప్పుతూ లైంగికంగా వేధించాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, పలువురు అనుమానితులను విచారించారు. చివరికి ఈ కేసులో దిలీప్ హస్తం ఉందని గుర్తించారు.