మరో వారసురాలు వస్తోంది!

హీరోల వారసులు హీరోలుగా, హీరోయిన్‌లుగా రాణిస్తున్నారు. తాజాగా వీరి జాబితాలో ఓ ప్రముఖ దర్శకుడి కుమార్తె చేరబోతోంది. తొలి ప్రయత్నంగా చేసిన అఖిల్ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించకపోవడంతో కొంత విరామం తీసుకున్న అఖిల్ ప్రస్తుతం మనం ఫేమ్ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున నిర్మిస్తున్న ఈ చిత్రంలో అఖిల్ సరసన శ్రీదేవి కూతురు జాహ్నవితో పాటు పలువురు కథానాయికల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే తాజాగా ప్రముఖ మలయాళ దర్శకుడు ప్రియదర్శన్, నటి లిజీల కుమార్తె కల్యాణిని కథానాయికగా ఖరారు చేశారు. ఈ విషయాన్ని దర్శకుడు విక్రమ్ కె.కుమార్ వెల్లడించారు. మరో పది రోజుల్లో కల్యాణి షూటింగ్‌లో పాల్గొంటుందని తెలిపారు.