మంత్రి మహేందర్ రెడ్డి విసృృత పర్యటన

వికారాబాద్‌ జిల్లాలో మంత్రి మహేందర్‌రెడ్డి విస్తృతంగా పర్యటించారు. పరిగి మండల కేంద్రంలో గిరిజన గురుకుల బాలికల పాఠశాల భవనానికి, వాటర్‌ ట్యాంక్, పైపులైన్ల నిర్మాణానికి మహేందర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. బొమ్రాస్‌పేట మండలం గౌరారంలో 13 మంది దళితులకు 28 ఎకరాల భూమి పంపిణీ చేశారు. తర్వాత కొడంగల్‌-వికారాబాద్‌ నాన్‌స్టాప్ బస్సులను ప్రారంభించారు. దౌల్తాబాద్‌లో రోడ్డు విస్తరణ పనులను మంత్రి ప్రారంభించారు.