భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను ఆర్జించాయి. జీఎస్టీ అమలుతో మార్కెట్లపై ఎలాంటి ప్రభావం ఉంటుందోనని అంతా ఉత్కంఠతో ఎదురుచూసినప్పటికీ ఇది ట్రేడింగ్‌ పై సానుకూల ప్రభావమే చూపింది. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సూచీ సెన్సెక్స్ ఆరంభం నుంచి లాభాల్లో కొనసాగింది. మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 300 పాయింట్లు లాభపడి… 31 వేల 222 పాయింట్ల వద్ద ముగిసింది. ప్రధాన సూచీలన్నీ భారీగా గెయిన్‌ అయ్యాయి. నిఫ్టీ 94 పాయింట్లు లాభపడింది.