భారీగా పెరిగిన ప్రొ కబడ్డీ ప్రైజ్‌మనీ

ప్రొ. కబడ్డీ లీగ్‌ ప్రైజ్‌మనీ భారీగా పెరిగింది. అయిదో సీజన్ నుంచి ప్రైజ్‌మనీ రూ. 8 కోట్లకు చేరనుంది. విజేతకు రూ.3 కోట్లు ప్రైజ్‌మనీగా అందజేస్తారు. రన్నరప్‌కు రూ. 1.8 కోట్లు లభిస్తాయి. గత సీజన్‌ వరకు ప్రొ. కబడ్డీ ప్రైజ్‌మనీ రూ.2 కోట్లు మాత్రమే. 12 జట్లు తలపడే ఐదో సీజన్‌ ఈనెల 28న హైదరాబాద్‌లో ప్రాంభం కానుంది.