భారత ఆర్థిక నేరగాళ్ల అప్పగింతకు సహకరించండి

భారత్‌ లో బ్యాంకుల రుణాలు చెల్లించకుండా బ్రిటన్‌ వెళ్లిపోయిన విజయ్‌ మాల్యాను మళ్లీ దేశానికి రప్పించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ఈ అంశంపై ప్రధాని మోడీ సైతం దృష్టి పెట్టారు. జర్మనీలోని హాంబర్గ్ లో జీ-20 సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన,  బ్రిటన్ ప్రధాని థెరిసా మే తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విజయ్‌ మాల్యా అంశాన్ని ప్రధాని మోడీ ప్రస్తావించారు. విజయ్ మాల్యా సహా దేశంలో ఆర్థిక నేరాలకు పాల్పడి బ్రిటన్ లో ఉంటున్న వారిని భారత్‌ కు తిరిగి అప్పగించేందుకు సహకరించాలని కోరారు. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ తెలిపింది. ఇప్పటికే భారత్‌ ఇందుకోసం కావాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తోంది.