భారత అమర జవాన్లకు ప్రధాని నివాళి

మొదటి ప్రపంచ యుద్ధంలో అమరులైన భారత జవాన్లకు నివాళులు అర్పించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇజ్రాయిల్ లో మూడో రోజు పర్యటిస్తున్న ప్రధాని… ఆర్మీ హెలికాప్టర్ లో హైఫా చేరుకున్నారు. అక్కడ మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన జవాన్ల స్మారక స్థూపం వద్ద పుష్పగుచ్ఛాన్ని ఉంచి నివాళులు అర్పించారు. మోడీతో పాటు ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ కూడా ఉన్నారు. అనంతరం భారత సైనికాధికారులను ప్రధాని మోడీ కలిశారు.