భారత్ లో దాడులు చేశాం!

భారత్‌ పై దాడులకు పాల్పడినట్లు అంగీకరించాడు అంతర్జాతీయ ఉగ్రవాది, హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ చీఫ్‌ సయ్యద్‌ సలావుద్దీన్‌. భారత్ లో టెర్రరిస్ట్‌ దాడులు చేసినట్లు ఓ టీవీ చానెల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. తనకు భారత్ లో పెద్ద ఎత్తున మద్దతుదారులు ఉన్నారని కూడా చెప్పాడు. 9/11 దాడుల తర్వాత ప్రపంచం పరిస్థితి మారిపోయిందన్నాడు. దీంతో కశ్మీర్‌ బయట ఉగ్రవాద దాడులు జరిపితే.. భారత్‌ ఇదే అవకాశంగా భావించి కశ్మీర్‌ను ఉగ్రవాద రాష్ట్రంగా ముద్రవేస్తుందని గ్రహించాం అని సలావుద్దీన్‌ వివరించాడు. తమకు కావాల్సిన ఆయుధాలను అంతర్జాతీయ మార్కెట్‌ నుంచి కొనుగోలు చేసినట్టు కూడా ఆయన వెల్లడించాడు. దీంతో పాక్‌ పై భారత్ చేసిన ఆరోపణలకు మరోసారి బలం చేకూరినట్టైంది.