భారత్‌, ఇజ్రాయెల్‌ మధ్య ఏడు ఒప్పందాలు

భారత్‌, ఇజ్రాయెల్‌ రెండు ఉగ్రవాద బాధిత దేశాలేనని ప్రధాని మోడీ తెలిపారు. ఉగ్రవాదాన్ని కలిసికట్టుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహూ తో సమావేశం తర్వాత ఇద్దరు నేతలు సంయుక్త ప్రకటన చేశారు. ఇరు దేశాల సంబంధాల్లో ఇదో చారిత్రక ఘట్టమన్నారు. భారత్, ఇజ్రాయెల్‌ ల మధ్య 7 కీలక ఒప్పందాలు కుదిరాయి. రక్షణ, వ్యవసాయం, అంతరిక్ష పరిశోధనల్లో ఇరు దేశాలు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు.  ఇదే సందర్భంగా ఇజ్రాయెల్‌ ప్రధాని కుటుంబంతో సహా భారత్‌ రావాలని ప్రధాని మోడీ వారిని ఆహ్వానించారు. ప్రధాని ఆహ్వానానికి ఇజ్రాయెల్ ప్రధాని ఒకే చెప్పారు.