భారత్‌తో దోస్తీ, పాక్‌కు చీవాట్లు

తమ ప్రధాన రక్షణ భాగస్వామి అయిన భారతదేశంతో మరింత సైనిక సహకారం కోరుకుంటున్నట్లు అమెరికా తన రక్షణ బడ్జెట్‌లో తెలిపింది. 2018 ఆర్థిక సంవత్సరానికి గాను 62,150 కోట్ల డాలర్ల రక్షణ బడ్జెట్‌ను అమెరికా కాంగ్రెస్‌ ఆమోదించింది. అదే సమయంలో పాకిస్తాన్‌కు చీవాట్లు పెట్టింది. ఉగ్రవాదంపై పోరాటంలో సంతృప్తికరమైన పురోగతి చూపిస్తేనే తాము నిధులిస్తామని స్పష్టం చేసింది. భారత్‌తో సహకారాన్ని పెంపొందించే సవరణను భారత-అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యుడు అమీ బెరా ప్రతిపాదించారు. దాన్ని సభ మూజువాణీ ఓటుతో ఆమోదించింది. అమెరికా ప్రపంచంలోనే అత్యంత పురాతన ప్రజాస్వామ్యం కాగా భారత్‌ అతిపెద్ద ప్రజాస్వామ్యమని, అందుకే ఈ రెండు దేశాల మధ్య రక్షణ సహకారం మరింత ముందుకెళ్లాలని అమీబెరా అన్నారు.