భగీరథ పనుల్లో వేగం పెంచండి

కామారెడ్డి జిల్లాలో జరుగుతున్న మిషన్‌ భగీరథ పనుల్లో వేగం పెంచాలని మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. లక్ష్యాలను నిర్ధేశించుకొని అక్టోబరు నాటికి పనులు పూర్తి చేసేలా కృషి చేయాలన్నారు. డిసెంబర్ నాటికి జిల్లాలోని ప్రతి ఇంటికి త్రాగునీరు అందించాలని స్పష్టం చేశారు. ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం, సివిల్ వర్క్స్ నిర్మాణం నెమ్మదిగా జరుగుతున్నాయన్నారు. జిల్లాలో మిషన్ భగీరథ పనుల పురోగతిపై అధికారులు, కాంట్రాక్టు ఏజెన్సీలతో కలెక్టరేట్ లో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జడ్పీ చైర్మన్ రాజు, జుక్కల్ శాసనసభ్యుడు హన్మంత్ షిండే, జిల్లా కలెక్టర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.