బ్రాహ్మణ విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్ షిప్ లు

రాష్ట్రంలోని పేద బ్రాహ్మణులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఇప్పటికే బ్రాహ్మణ కార్పోరేషన్‌ ద్వారా బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి చేస్తున్న సర్కారు.. తాజాగా వివేకానంద ఓవర్సీస్‌ స్కాలర్‌ షిప్‌ పథకం ద్వారా పేద బ్రాహ్మణ విద్యార్థులకు విదేశాల్లో చదువునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ మేరకు ఏడుగురు విద్యార్థులకు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యులు ఇంటర్వ్యూ నిర్వహించి వారికి స్కాలర్‌ షిప్‌ పత్రాలను అందచేశారు. స్కాలర్‌ షిప్‌ పొందడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ కు ఎప్పటికీ రుణపడి ఉంటామని తెలిపారు.