బెంజ్ కార్లు, హవాయి చెప్పులు ఒకటేనా?

జీఎస్టీ వల్ల దేశ ఆర్ధిక వ్యవస్థలో సమగ్ర మార్పు వస్తుందన్నారు ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ. అన్ని వస్తువులపై పన్ను రేట్లను ఒకే విధంగా ఉంచాలని కొన్ని పార్టీలు అంటున్నాయని, అయితే బెంజ్ కారుపై, హవాయి చెప్పులపై ఒకే విధమైన పన్నులు ఎలా వేస్తారని ప్రశ్నించారు జైట్లీ. ఢిల్లీలో జరుగుతున్న ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఆవిర్భావ దినోత్సవంలో ఆయన మాట్లాడారు.