బుర్హాన్‌ వానీ ఎన్‌కౌంటర్‌ జరిగి నేటికి ఏడాది

కశ్మీర్‌ వ్యాలీలో భారీగా భద్రత బలగాలను మొహరించారు. ఉగ్రవాది బుర్హాన్‌ వానీ ఎన్‌కౌంటర్‌ జరిగి నేటి సరిగ్గా ఏడాది పూర్తైంది. ఈ నేపథ్యంలో బుర్హాన్‌ సంస్మరణ దినం జరిపాలని పలువురు భావిస్తున్నారు. అదే జరిగితే అల్లర్లు జరిగే ప్రమాదం ఉందని ముందస్తుగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. గతేడాది బుర్హాన్ వానీ మృతి తర్వాత కశ్మీర్ లోయ కల్లోలంగా మారింది. ఆయన ఎన్‌కౌంటర్‌ కు నిరసనగా జనం చేపట్టిన ఆందోనలు ఉద్రిక్తతకు దారి తీశాయి. దీంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో 20 మందికి పైగా మృతి చెందారు. ఆరు నెలల పాటు అల్లర్లు అదుపులోకి రాలేదు.