బీహార్ లో పరిణామాలపై ఆర్జేడీ సమావేశం

 

సీబీఐ కేసుతో ఉక్కిరి బిక్కిరవుతున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్…ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ లో డిప్యూటీ సీఎం  తేజస్వీ యాదవ్ పేరు కూడా ఉండటంతో….ఆయన రాజీనామా చేయాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే  డిప్యూటీ సీఎం తేజస్వీ…రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఆర్జేడీ ప్రకటించింది. మహా కూటమికి వచ్చిన నష్టమేమీ లేదని కూడా తెలిపింది. జరుగుతున్న పరిణామాలపై బీహార్ సీఎం నితీష్‌ కుమార్…నిన్న లాలూ ప్రసాద్ యాదవ్ తో ఫోన్లో మాట్లాడారని కూడా ప్రకటించింది ఆర్జేడీ. లాలూ ప్రసాద్ నిర్వహించిన ఈ సమావేశానికి ఆయన భార్య రబ్రీదేవీ, ఇద్దరు తనయులతో పాటూ పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు.