‘బిగ్‌బాస్’ షోలో శ్రీముఖి!

‘పటాస్’ షోతో యాంకర్ శ్రీముఖి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అడపాదడపా సినిమాల్లో నటిస్తూనే టీవీ షోలు కూడా చేస్తోంది. ఎన్టీఆర్ హోస్ట్‌గా చేస్తున్న ‘బిగ్‌బాస్’ రియాలిటీ షోలో శ్రీముఖికి అవకాశం వచ్చిందట. ఈ షోకోసం ముంబై వెళ్లేందుకు సిద్ధమవుతున్న వారి జాబితాలో శ్రీముఖి పేరు కూడా ఉందనే విషయం ఇప్పుడు టాక్‌ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. శ్రీముఖిని నమ్ముకునే బుల్లితెరపై రెండుమూడు షోలు రాజ్యమేలుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘బిగ్‌బాస్’ కోసం రెండున్నర నెలలపాటు శ్రీముఖి ముంబై వెళ్లిపోతే పటాస్‌లాంటి షోల పరిస్థితి ఏంటనే సందేహాలు ఇండస్ట్రీలో వ్యక్తమవుతున్నాయి.