బాధ్యతలు చేపట్టిన టామ్ కామ్ చైర్మన్

టామ్ కామ్ చైర్మన్ బోయపల్లి రంగారెడ్డి హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ లోని మల్లేపల్లి ఐటిఐ కాలేజీలో ఉన్న కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి నాయిని నరసింహరెడ్డి, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. విదేశాలకు ఉపాధి కోసం వెళ్లే కార్మికులకు అండగా నిలిచే లక్ష్యంతో టామ్ కామ్ సంస్థను ప్రారంభించామని మంత్రి నాయిని చెప్పారు. విదేశాల్లోని కార్మికుల ఇబ్బందులను తీర్చడంలో టామ్ కామ్ ముందుండి పని చేయాలని, రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలను సాకారం చేయడమే లక్ష్యంగా టామ్ కామ్ ముందుకు నడవాలని కోరారు. భవిష్యత్తులో రాష్ట్ర కార్మికులను నెంబర్ వన్ గా నిలపాలని, ఆ దిశగా ముందుకెళ్లాలని సూచించారు.